తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి... వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 25,521 కరోనా పరీక్షలు
- 468 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 253 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 246 మంది
- ఇంకా 4,643 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,00,944 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,92,190 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,643 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
