సినీ నటి మీనా భర్త మృతికి పావురాలే కారణమా?

Are pigeons cause for Meena husband death
  • శ్వాసకోశ సమస్యలతో మృతి చెందిన మీనా భర్త
  • పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్య
  • కరోనా కూడా సోకడంతో తీవ్రతరమైన ఊపిరితిత్తుల సమస్య
ప్రముఖ సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ నిన్న రాత్రి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సమస్యలతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే పావురాల వల్లే ఆయన చనిపోయారంటూ తమిళ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చడం వల్లే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారని కథనాలు వస్తున్నాయి.

మీనా వాళ్లు ఉంటున్న ప్రాంతంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ప్రారంభమయిందట. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు కరోనా సోకడంతో ఊపిరితిత్తుల సమస్య మరింత ఎక్కువయింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ దాతలు దొరకలేదు. దీంతో చివరకు ఆయన మృతి చెందారు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది.
Go Back to Shorts
Meena
Husband
Dead
Pigeons

More Telugu News