కేటీఆర్‌తో ఫాక్స్‌కాన్ బృందం భేటీ... పెట్టుబడులతో రావాలన్న మంత్రి
- హైదరాబాద్‌కు వచ్చిన ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ
- ప్రతినిధి బృందంతో కలిసి కేటీఆర్‌తో భేటీ
- తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా కేటీఆర్ చర్చలు
ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ లియూను కేటీఆర్ కోరారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు తదితరాలను కేటీఆర్ ఫాక్స్‌కాన్ బృందానికి వివరించారు. ఈ విషయాలను స్వయంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడికి హామీ దక్కేసిందని కూడా కేటీఆర్ వివరించారు.