తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పైపైకి!
- గత కొన్నిరోజులుగా 200కి పైన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 28,424 కరోనా పరీక్షలు
- 285 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 188 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 65 మంది
- ఇంకా 1,621 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 7,95,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,89,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,621 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
