'777 చార్లీ' సినిమా చూసి కన్నీటిపర్యంతమైన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
- జూన్ 10న విడుదలైన 777 చార్లీ చిత్రం
- వ్యక్తికి, పెంపుడు కుక్కకు మధ్య అనుబంధాన్ని చూపిన సినిమా
- కర్ణాటక సీఎం కోసం ప్రత్యేక ప్రదర్శన
సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పలుమార్లు కళ్లు తుడుచుకున్నారు. అంతేకాదు, 777 చార్లీ సినిమాను ప్రతి ఒ్కరూ తప్పక చూడాలని పిలుపునిచ్చారు. "శునకాలపై ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రంలో జంతువుల భావోద్వేగాలను కూడా చూపించారు. ఈ సినిమాలో కుక్క తన కళ్ల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తుంది. సినిమా చాలా బాగుంది. చూడాల్సిన సినిమా ఇది. కుక్క చూపించే ప్రేమ నిజంగా ఎలాంటి షరతుల్లేని ప్రేమ. అది స్వచ్ఛమైనది" అని బొమ్మై వివరించారు.