ఉత్సాహం కోసం ఈ వీడియో చూడండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- తమిళనాడులోని ఓ ఆలయం ఏనుగు పుట్టిన రోజు వేడుక
- వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన మహీంద్రా
- తలాండించే విధానం బాగుందంటూ ట్వీట్
‘‘ఈ క్లిప్ తమిళనాడులోని తిరువానైకవల్ ఆలయానికి సంబంధించి అఖిల అనే ఏనుగు పుట్టిన రోజు సంబరాలది. ఏనుగు దేశీ రూపం, తల ఆడించే విధానం నాకు ఎంతో నచ్చింది. పైగా అది ఆనందించే తీరు ఇతరులనూ ఆకట్టుకునేలా ఉంది. తమను తాము సంతోషపరుచుకోవాలని భావించే వారికి ఇదొక మంచి క్లిప్’’అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఏనుగు తనకు ప్రసాదంగా పెట్టిన వివిధ రకాల పండ్లను రుచిచూస్తూ సంతోషంగా తలాడించడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.