Chiranjeevi: 'భోళా శంకర్' సెట్స్ పైకి మెగాస్టార్!

  • 'భోళా శంకర్' గా చిరంజీవి
  • 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్ 
  • కథానాయికగా మెరవనున్న తమన్నా 
  • మెగాస్టార్ కి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
Bhila Shankar movie update

చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా రూపొందుతోంది. 'గాడ్ ఫాదర్' .. 'వాల్తేర్ వీరయ్య' .. 'భోళా శంకర్' సినిమాలను చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. 'గాడ్ ఫాదర్' సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెడుతున్నారు.
 
'వేదాళం' సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'భోళా శంకర్'కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ మధ్య చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 21వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. ఆ రోజు నుంచి చిరంజీవి తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతూ ఉండటంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం మేకర్స్ ఈ ప్రకటన చేశారు. చిరంజీవి సరసన నాయికగా తమన్నా కనువిందు చేయనుండగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News