బాలయ్య సినిమా టైటిల్ ఇదేనంటూ రూమర్!
- షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా
- ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మలినేని
- ఆ తరువాత ప్రాజెక్టు అనిల్ రావిపూడితో చేయనున్న బాలయ్య
- టైటిల్ 'బ్రో ఐ డోంట్ కేర్' అంటూ టాక్
అయితే ఈ సినిమా టైటిల్ కంటే .. ఆ తరువాత సినిమా అయిన అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వినిపిస్తుండటం విశేషం. 'ఎఫ్ 3' సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఆ తరువాత సినిమాను బాలయ్యతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాకి 'బ్రో ఐడోంట్ కేర్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. అధికారికంగా రేపు ఈ టైటిల్ ను రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా సాగుతుందనీ, కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తుందని ముందుగానే చెప్పాడు. ఇక కథానాయికలుగా మెహ్రీన్ .. ప్రియమణి పేర్లు వినిపిస్తున్నాయి.