నయనతార, విఘ్నేశ్ ల పెళ్లి ఈరోజే... భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టిన విఘ్నేశ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నయనతార, విఘ్నేశ్ ల పెళ్లి ఈరోజే... భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టిన విఘ్నేశ్!

Today is marriage of Nayanthara and Vignesh Sivan
  • కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేశ్
  • మహాబలిపురంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈరోజు జరగనున్న వివాహం
  • తన జీవితాన్ని నయన్ కు అంకితం చేస్తున్నానన్న విఘ్నేశ్
అందాల భామ నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు ఈరోజుతో పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ ఈరోజు కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. మహాబలిపురంలోని షెరిటన్ హోటల్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు. 

ఈ రోజు నయన్ డే అని ఆయన చెప్పాడు. మంచి వ్యక్తులు, మంచి సమయాలు, అనుకోని మధురమైన ఘటనలు, అందరి ఆశీస్సులు, దేవుడి ప్రార్థనలు, షూటింగ్ రోజులు... తన జీవితం ఇంత ఆనందంగా ఉండేందుకు ఇదే కారణమని తెలిపాడు. ఈ ఆనందమైన జీవితాన్ని 'లవ్ ఆఫ్ మై లైఫ్' నయన్ కు అంకితం చేస్తున్నానని చెప్పాడు. పెళ్లికూతురుగా ముస్తాబై, వేదికపైకి వస్తున్న నయన్ ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జీవితంలో మరో అంకాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఉన్నానని చెప్పారు.
Nayanthara
Vignesh Sivan
Marriage
Tollywood
Kollywood

More Telugu News