Nikhil: నిఖిల్ 'స్పై' థ్రిల్లర్ నుంచి ఫస్టు గ్లింప్స్

  • నిఖిల్ తాజా చిత్రంగా రానున్న '18 పేజెస్'
  • ఆ తరువాత రిలీజ్ కి రెడీగా 'కార్తికేయ 2'
  • లైన్లోనే ఉన్న 'స్పై'
  • కథానాయికగా ఐశ్వర్య మీనన్
Spy movie first glimpse

ఒక వైపున నిఖిల్ తాజా చిత్రాలుగా '18 పేజెస్' .. 'కార్తికేయ 2' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ తరువాత  సినిమా అయిన 'స్పై' ను కూడా ఆయన లైన్లో పెట్టేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతవరకూ ఎడిటర్ గా పనిచేస్తూ వచ్చిన ఆయనకి, దర్శకుడిగా ఇది ఫస్టు మూవీ.

స్పై థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. మంచుకొండల్లో హీరో అన్వేషణ .. అక్కడ రహస్యంగా దాచిన ఆయుధాలను వెతికి తీసుకోవడం .. తన లక్ష్యం దిశగా ముందుకు దూసుకుపోవడం ఈ గ్లింప్స్ లో చూపించారు. సినిమాపై ఆసక్తిని పెంచేదిలానే ఈ గ్లింప్స్ ఉంది. 

నిఖిల్ కెరియర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాగా దీనిని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. బాలీవుడ్ .. హాలీవుడ్ కి చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం. ముఖ్యమైన పాత్రల్లో అభినవ్ .. మకరంద్ దేశ్ పాండే .. జిషు సేన్ గుప్తా కనిపించనున్నారు.

More Telugu News