గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్... రేపు పార్టీ విస్తృత సమావేశానికి హాజరు
- రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయవాడకు పవన్
- మంగళగిరి పార్టీ కార్యాలయంలో రేపు పార్టీ విస్తృత స్థాయి సమావేశం
- ఈ సమావేశంలో పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న దిశగా ప్రచారం
ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న దిశగానూ ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన రేపటి విస్తృత స్థాయి సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.