కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్
- హైదరాబాద్ విముక్తిలో దారుసలేం ఏం చేసిందన్న సంజయ్
- తెలంగాణ ప్రజలను చంపిన రజాకార్లతో కేసీఆర్ స్నేహం చేస్తున్నారని విమర్శ
- గిరిజనుల పక్షాన అల్లూరి సీతారామరాజు పోరాడారని వివరణ
హైదరాబాద్ విముక్తిలో దారుసలేం (ఎంఐఎం) ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి పార్టీతో కలిసి ఉన్న టీఆర్ఎస్ దీనిపై వివరణ ఇవ్వాలని అన్నారు. సొంత తెలంగాణ ప్రజలను చంపిన రజాకార్లతో టీఆర్ఎస్ స్నేహం చేస్తోందని విమర్శించారు. అణచివేతకు గురవుతున్న గిరిజనుల పక్షాన అల్లూరి సీతారామరాజు పోరాడారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందే బీజేపీ నిర్ణయించుకుందని అన్నారు.