'సర్కారువారి పాట'కి కొత్తగా జోడించిన 'మురారివా' సాంగ్!
- క్రితం నెల 12న వచ్చిన 'సర్కారువారి పాట'
- భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా
- పాటల పరంగా లభించిన మంచి మార్కులు
- అదనపు ఆకర్షణగా చేర్చిన 'మురారివా' పాట
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. సినిమా విడుదలకి ముందే ప్రతి పాట రికార్డుస్థాయి వ్యూస్ ను సంపాదించుకుంది. 'కళావతి' .. 'మ మ మహేశా' పాటలు దుమ్మురేపేశాయి. ముందుగా 'మురారివా' అనే పాటను అనుకున్నామనీ, చిత్రీకరణను కూడా పూర్తి చేశామని ప్రమోషన్స్ లో పరశురామ్ చెప్పాడు.
ఆ తరువాత ఆ పాట కోసం అనుకున్న ప్లేస్ లో 'మ మ మహేశా'ను సెట్ చేశామని అన్నాడు. దాంతో 'మురారివా' సాంగ్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఈ పాటను జోడించారు .. అదనపు ఆకర్షణను తీసుకుని వచ్చారు. మరి ఈ పాట రిపీట్ ఆడియన్స్ ను ఎంతవరకూ థియేటర్స్ కి తీసుకుని వస్తుందో చూడాలి.