Nepal: న‌లుగురు భార‌తీయులు స‌హా 22 మందితో టేకాఫ్ అయిన నేపాల్ విమానం మిస్సింగ్‌

tara air flight missing on sunday morning in nepal
షార్ట్స్‌లో చూడండి
22 మందితో టేకాఫ్ అయిన నేపాల్ విమానం ఒక‌టి ఆదివారం గ‌ల్లంతు అయ్యింది. నేపాల్‌లోని ఫోక్రా నుంచి జామ్‌స‌న్‌కు బ‌య‌లుదేరిన తారా ఎయిర్‌లైన్స్ విమానానికి ఆదివారం ఉద‌యం 9.55 గంట‌ల‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. 

ఈ విమానంలో 19 ప్ర‌యాణికుల‌తో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్ర‌యాణికుల్లో న‌లుగురు భార‌తీయులు స‌హా ముగ్గురు జ‌ప‌నీయులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై నేపాల్ అధికారులు దృష్టి సారించారు. గల్లంతైన విమానం ఆచూకీ క‌నుగొనే చ‌ర్య‌ల‌ను మొద‌లుపెట్టారు. గల్లంతు అయిన విమానం ఆచూకీ కోసం నేపాల్ అధికారులు రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
Go Back to Shorts
Nepal
Tara Air
Pokhara
Jomsom

More Telugu News