'కేజీఎఫ్' హీరోతో దిల్ రాజు మూవీ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కేజీఎఫ్' హీరోతో దిల్ రాజు మూవీ?

Yash in Dil Raju Movie
  • 'కేజీఎఫ్' తో మారిపోయిన యశ్ రేంజ్
  • 'కేజీఎఫ్ 2'తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ 
  • 'కేజీఎఫ్ 3' కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • ఈ లోగా దిల్ రాజు బ్యానర్ లో చేయనున్నాడంటూ టాక్  
వెండితెరపై స్టార్ హీరోగా క్రేజ్ ను తెచ్చుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. స్టార్ డమ్ రావడానికి కొంతమందికి కొన్నేళ్ల సమయం పడితే, మరికొంతమందికి చాలా తక్కువ సినిమాలతోనే స్టార్ డమ్ వస్తుంది. అలాంటి హీరోలలో ఒకరిగా యశ్ కనిపిస్తాడు. 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా ఆయన రేంజ్ మారిపోయింది.

ఆ సినిమాకి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. వేయి కోట్ల క్లబ్ లోకి చాలా తేలికగా చేరిపోయిన ఈ సినిమా , ఒక్క హిందీలోనే 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక 'కేజీఎఫ్ 3' కూడా ఉందని చెప్పడంతో ఆయన ఆ సినిమా పనుల్లోనే ఉంటాడని అనుకున్నారు. 

కానీ ఈ లోగా ఆయన తెలుగులో ఒక భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్టు  తెలుస్తోంది. ఆ సినిమాకి నిర్మాత దిల్ రాజు అని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా .. వంశీ పైడిపల్లితో విజయ్ సినిమా చేస్తున్న ఆయన, యశ్ తోను ఓ ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టు వినికిడి. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం.
yash
Dil Raju
Tollywood

More Telugu News