ప్రాచీన తమిళ అక్షరాలతో ఆనంద్ మహీంద్రా చిత్తరువు... తమిళంలో బదులిచ్చిన వ్యాపారవేత్త
Add ap7am to your home Screen

ప్రాచీన తమిళ అక్షరాలతో ఆనంద్ మహీంద్రా చిత్తరువు... తమిళంలో బదులిచ్చిన వ్యాపారవేత్త

Tamilnadu man portraits Anand Mahindra with ancient Tamil letters
  • 741 అక్షరాలతో ఆనంద్ మహీంద్రా బొమ్మ
  • ఆచ్చెరువొందిన వ్యాపారవేత్త
  • చిత్రకారుడికి అభినందనలు
  • ఆ చిత్రాన్ని తన ఇంట్లో ఉంచుకుంటానని వెల్లడి
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి సోషల్ మీడియాలో స్పందించారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గీసిన తన చిత్రాన్ని చూసి ఆయన అచ్చెరువొందారు. కాంచీపురంకు చెందిన గణేశ్ అనే వ్యక్తి ప్రాచీన తమిళ అక్షరాలతో ఆనంద్ మహీంద్రా బొమ్మను గీయడం విశేషం. ఈ క్రమంలో గణేశ్ 741 అక్షరాలను ఉపయోగించారు. ఈ విధంగా అక్షరాలను ఉపయోగించి చిత్రించడం ఇదే ప్రథమం అని ఆ వ్యక్తి తెలిపారు. ఈ బొమ్మపై మీ స్పందన తెలుసుకోవాలనుందని ఆనంద్ మహీంద్రాను కోరారు. 

తమిళ ప్రాచీన అక్షరాలతో కొత్త తరహాలో ఉన్న తన చిత్రాన్ని చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. నిజంగా అద్భుతం అని కితాబిచ్చారు. తన బొమ్మ గీసిన ఆ చిత్రకారుడ్ని అభినందిస్తున్నానని తెలిపారు. తమిళ భాష గొప్పదనాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ చిత్రకారుడ్ని అభినందిస్తూ ఆ బొమ్మను తన నివాసంలో ఉంచుతానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.
Anand Mahindra
Portrait
Ancient Tamil Letters
Ganesh
Kanchipuram
Tamil Nadu

More Telugu News