160 ఏళ్ల చరిత్ర కలిగిన 'స్విస్ రే' బీమా సంస్థను హైదరాబాదుకు తీసుకువస్తున్న కేటీఆర్
- దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
- తరలి వెళ్లిన కేటీఆర్ బృందం
- స్విస్ రే బీమా సంస్థతో చర్చలు
- ఆగస్టులో హైదరాబాదులో ఆఫీసు ఏర్పాటు
బీమా రంగంలో స్విస్ రే సంస్థకు 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని ఆయన వివరించారు. స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉందని, ప్రపంచవ్యాప్తంగా 80 ప్రాంతాల నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇక, హైదరాబాదులో స్విస్ రే సంస్థ తొలుత 250 మంది సిబ్బందితో ప్రారంభం కానుందని కేటీఆర్ ట్విట్టర్ లో వివరించారు. డేటా, డిజిటల్ సామర్థ్యాలు, ఉత్పత్తి నమూనాలు, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించనుందని వెల్లడించారు.
దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తమను కలిసి ఆలోచనలు పంచుకున్నందుకు స్విస్ రే గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్, సంస్థ ఎండీ (పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్) ఇవో మెంజింగర్ లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు.
.