Junior NTR: న‌లుపు రంగు ముఖం, మీసం, గడ్డంతో తార‌క్.. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్ సినిమా పోస్ట‌ర్ విడుద‌ల‌

NTR DIRECTOR PRASHANTH NEEL JOIN HANDS FOR PAN INDIA FILM
షార్ట్స్‌లో చూడండి
జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా మజా అందింది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన స్పెషల్ వీడియో విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత 'కేజీఎఫ్' ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31వ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ పాన్-ఇండియా మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. 

       ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 23న ప్రారంభం కానుంద‌ని ఆ సినిమా యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ముఖంలో కుడి భాగం క‌న‌ప‌డేలా ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. న‌లుపు రంగు ముఖం, మీసం, గడ్డంతో ఎన్టీఆర్ కోపంగా చూస్తున్న‌ట్లు ఈ లుక్ ఉంది.
Go Back to Shorts
Junior NTR
kgf
PRASHANTH NEEL

More Telugu News