Crime News: వావి వరుసలు మరచి సొంత చెల్లెలినే కాటేసిన ఇంటర్ విద్యార్థి.. హైదరాబాద్​ బాచుపల్లిలో దారుణం

Inter Student Rapes His Minor Sister Held Under POCSO
  • పలుమార్లు అఘాయిత్యం
  • కడుపునొప్పి రావడంతో బాలికకు ఆసుపత్రిలో చెకప్
  • గర్భందాల్చిందని చెప్పిన వైద్యులు
  • అబార్షన్ చేయించేందుకు ప్రయత్నం
  • బాలల సంరక్షణ విభాగానికి వైద్యుల ఫిర్యాదు
అతడు చదివేది ఇంటరే. వయసు 17 ఏళ్లే. వావి వరుసలు మరచి సొంత చెల్లెలిపైనే కన్నేశాడు. అన్నే కదా అని ఒకే గదిలో రోజూ నిద్రపోతుంటే.. అదే అదనుగా తన చెల్లెలినే కాటేశాడు. లోబరచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. హైదరాబాద్లోని బాచుపల్లి వద్ద జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కేరళకు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ కు వచ్చి స్థిరపడింది. ఆ కుటుంబ పెద్ద వ్యాపారం చేస్తుండగా.. అతడి భార్య ఐటీ ఉద్యోగి. వాళ్లకు ఇంటర్ చదివే కుమారుడు, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె (13) వున్నారు. అన్నాచెల్లెళ్లు ఒకే గదిలో నిద్రకు ఉపక్రమించేవారు. ఈ క్రమంలోనే రక్తం పంచుకుపుట్టిన తోబుట్టువని కూడా చూడకుండా చెల్లెలిపై పలుమార్లు మైనర్ నిందితుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

ఇటీవల బాలికకు కడుపు నొప్పి రావడంతో మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా.. గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఈస్ట్ మారేడ్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని మేడ్చల్ జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులకు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఈ నెల 17న మైనర్ నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. అతడిని జువనైల్ హోంకు తరలించారు.
Crime News
Telangana
Hyderabad
Rape

More Telugu News