Junior NTR: పుకార్లను పట్టించుకోని కొరటాల!

Koratala and Ntr Combo Update
షార్ట్స్‌లో చూడండి
కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'ఆచార్య' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది .. అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకి సంబంధించిన లావాదేవీలతో కొరటాల సతమతమవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ సెటిల్ మెంట్లు పూర్తయ్యేవరకూ ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది.

ఇక 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అందువలన సహజంగానే ఆయన తదుపరి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగినట్టుగా ఎన్టీఆర్ ను చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా స్క్రిప్ట్ పై కొరటాల మరింత బలంగా కసరత్తు చేస్తున్నాడనే మరో టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగా  కూడా ఆలస్యం కావొచ్చని అంటున్నారు. 

అయితే కొరటాల మాత్రం ఈ పుకార్లేవీ పట్టించుకోకుండా, ఈ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడట. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆ రోజున ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ను వదలడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని చెబుతున్నారు.
Go Back to Shorts
Junior NTR
Koratala Siva
Tollywood

More Telugu News