సంక్రాంతి బరిలోకి దిగే దిశగా ఎన్టీఆర్ సినిమా!

Ntr in Koratala movie
  • కొరటాల సినిమా కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్ 
  • ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు 
  • ఆ రోజున కొరటాల సినిమా లాంచ్
  • జూన్ .. జులై నెలల్లో రెగ్యులర్ షూటింగ్ 
  • లైన్లో ప్రశాంత్ నీల్ .. బుచ్చిబాబు
'ఆర్ ఆర్ ఆర్' సినిమా సమయంలో ఎన్టీఆర్ మరో సినిమాను చేయలేదు. ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, ఎన్టీఆర్ ఇక వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ జాబితాలో ముందుగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆ రోజున కొరటాల సినిమాను లాంచ్ చేయనున్నారు. జూన్ నుంచిగానీ .. జులై నుంచిగాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఉన్నారట. ఆ దిశగానే అన్నీ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. 

ఇది కొరటాల మార్క్ సినిమాగానే సున్నితంగా సందేశాన్ని ఇచ్చేదిగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే  ఉన్నాయని సమాచారం.
Go Back to Shorts
Junior NTR
Koratala Siva
Prashanth Neel
Buchi Babu

More Telugu News