మహేశ్ 'మురారి బావ' సాంగ్ యూట్యూబ్ లోనే!

Sarkaru Vaari Paata movie update
  • 'సర్కారువారి పాట'లో నాలుగు సాంగ్స్ 
  • ప్రతి పాటకి లభిస్తున్న రికార్డు స్థాయి వ్యూస్ 
  • మరో పాటను నేరుగా యూ ట్యూబ్ లో వదిలే ఆలోచన 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల   
మహేశ్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'సర్కారువారి పాట' రేపు భారీ స్థాయిలో విడుదలవుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ నాలుగు సాంగ్స్ వదిలారు. అయితే 'మురారి బావ' అనే మరో సాంగ్ ఉందనీ, అది థియేటర్లో చూడవలసిందే అనే టాక్ వినిపిస్తోంది.

పరశురామ్ మాత్రం తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమా కోసం 'మురారి బావ' అనే సాంగును మహేశ్ - కీర్తి సురేశ్ పై చిత్రీకరించారట. అయితే ఆ ప్లేస్ లో కాస్త మాస్ బీట్ ఉంటే బాగుంటుందని టీమ్ అభిప్రాయపడిందట. 

చివరికి 'మురారి బావ' అనే సాంగ్ ను పక్కన పెట్టేసి, 'మ మ మహేశా' అనే సాంగ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఇప్పుడు ఈ సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాను రిలీజ్ చేసిన తరువాత, 'మురారి బావ' పాటను యూ ట్యూబ్ లో వదలనున్నట్టుగా చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో గిఫ్ట్ రెడీగా ఉందన్న మాట.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Sarkaruvari pata

More Telugu News