ఆ యాక్షన్ సీన్ కష్టంగానే అనిపించింది: మహేశ్ బాబు

Sarkaru Vaari Paata movie update
  • 'సర్కారువారి పాట' ప్రమోషన్స్ లో మహేశ్ 
  • మండుటెండల్లో ఫైట్స్ చేయించారని వ్యాఖ్య 
  • బీచ్ ఫైట్ ఇబ్బంది పెట్టేసిందంటూ వివరణ
  • మంచి రెస్పాన్స్ ఉంటుందన్న మహేశ్   
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారు పాట' నిర్మితమైంది. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ తో మహేశ్ బాబు ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " కథాకథనాల సంగతి అటుంచితే, నా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండి నచ్చడం వలన ఈ సినిమాకి ఓకే చెప్పాను.

ఈ సినిమాలో సాంగ్స్ ఎంత  సరదాగా ఉంటాయో .. ఫైట్స్ అంత కష్టమైనవిగా అనిపిస్తాయి. కొన్ని రిస్కీ ఫైట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఫైట్ ప్రత్యేకంగా డిజైన్ చేయటం వలన చాలా కష్టపడవలసి వచ్చింది. ముఖ్యంగా బీచ్ లో ఫైట్ సీన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది. ఎర్రటి ఎండల్లో 10 రోజుల పాటు ఆ యాక్షన్ సీన్ ను షూట్ చేశారు. పైగా అది పూర్తిగా మాస్ ఫైట్. 

అందువలన నేను ఆ ఫైట్ సీన్ కోసం మరింత కష్టపడ్డాను. ముఖ్యంగా ఈ ఫైట్ సీన్ కి థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. ఇక కీర్తి సురేశ్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె పాత్ర కూడా వెంటనే కనెక్ట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా ఆమె కెరియర్లోను చెప్పుకోదగిన సినిమా అవుతుంది" అని అన్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Parashuram
Sarkaruvari Pata Movie

More Telugu News