మహేశ్ బాబు టాటూపైనే అందరి దృష్టి!

Sarkaru Vaari Paata movie update
  • 'సర్కారువారి పాట' ప్రమోషన్స్  లో పరశురామ్ 
  • మహేశ్ టాటూ వెనుక కారణం ఉందంటూ వెల్లడి
  • కథకీ ..ఆ టాటూకి లింక్ ఉందన్న పరశురామ్ 
  • ఆడియన్స్ అంగీకరించేలా ఉంటుందంటూ స్పష్టీకరణ   
మహేశ్ బాబు కథానాయకుడిగా 'సర్కారువారి పాట' సినిమాను రూపొందించిన పరశురామ్, ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాడు. తొలిసారిగా ఈ సినిమాలో కీర్తి సురేశ్ .. మహేశ్ జోడీ కట్టింది. ఈ జంటను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ సినిమాలో మహేశ్ మెడపై రూపాయి కాయిన్ టాటూ ఉంటుంది. యాక్షన్ సీన్స్ లో కూడా ఆ టాటూను హైలైట్ చేస్తూ చూపించారు. మహేశ్ మెడపై రూపాయి కాయిన్ టాటూ అందరినీ కూడా బాగా ఆకట్టుకుంది. అలా ఆయనకి టాటూ  వేయించడానికి కారణం ఏమిటనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ కి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "ఇది డబ్బు చుట్టూ తిరిగే కథ కదా అనే ఉద్దేశంతో అలా టాటూ వేయించలేదు. మహేశ్ మెడపై టాటూ వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయించడం జరిగింది. కథలో భాగంగానే అలా చూపించడం జరిగింది. ఆ కారణం తెలిశాక ప్రతి ఒక్కరూ దానిని అంగీకరిస్తారు" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Sarkaru Vaari Paata

More Telugu News