సితారను రెచ్చగొట్టకండమ్మా!: మహేశ్ బాబు
- తన సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు
- సితారతో 'పెన్నీ'సాంగ్ చేయించింది తమన్ అంటూ వ్యాఖ్య
- తన డాన్స్ చూశాక గర్వంగా అనిపించిందని వ్యాఖ్య
- తప్పకుండా గొప్ప ఆర్టిస్ట్ అవుతుందంటూ కితాబు
అందుకు మహేశ్ స్పందిస్తూ .. "ఈ సినిమాలోని 'పెన్నీ' మేకింగ్ వీడియోను సితారతో కూడా చేయిద్దామనే ఆలోచన చేసింది తమన్. ఆ విషయం తమన్ నాకు చెప్పినప్పుడు షూటింగులో ఉన్నాను. తమన్ కి నమ్రత ఓకే చెప్పేయడం .. షూటింగ్ చేసేయడం కూడా జరిగిపోయాయి. సితార డాన్స్ చూశాక తను గొప్ప ఆర్టిస్ట్ అవుతుందని అనిపించింది.
సితారతో చేసింది ఓన్లీ మేకింగ్ వీడియోనే. అందువలన తను సినిమాలోని పాటలో కనిపించదు. "నేనెందుకు సినిమాలో లేను" అంటూ ఇప్పటికే తను నన్ను సతాయిస్తోంది. తన పేరు ఎండ్ టైటిల్స్ లో వేశారా ? అని మీరు అడుగుతున్నారు. ఈ మాట వింటే ఇప్పుడు మళ్లీ అదో పెద్ద గొడవై కూర్చుంటుంది. మీరు తనని ఉసిగొల్పకుండా ఈ టాపిక్ ని ఇంతటితో ఆపేయండి" అంటూ మహేశ్ నవ్వేశారు.