Anand Mahindra: ష్.. అది చెబితే నా ఉద్యోగం ఊడుతుంది: ఆనంద్ మహీంద్ర

Anand Mahindra Epic Answer For This Question
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. తన ఫాలోవర్లు, ట్విట్టర్ యూజర్లకు దగ్గరగా ఉంటూ వారడిగే వాటికి బదులిస్తారు. సామాజికంగా అవగాహన పరిచేలా ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. 

మార్కెట్ లోకి కొత్త స్కార్పియోను మహీంద్ర తీసుకురానున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ స్కార్పియో రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలంటూ ఓ యూజర్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దానికి స్పందించిన ఆయన.. ‘‘ష్.. చెప్పకూడదు.. అది నేను మీకు చెప్పానంటే నా ఉద్యోగం ఊడుతుంది. ఈ విషయం మాత్రం చెబుతున్నా. మీ అందరికన్నా ఎక్కువ ఉత్కంఠగా నేనూ ఎదురు చూస్తున్నా’’ అంటూ బదులిచ్చారు.  

ఆయన జవాబుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘‘జనాల హృదయాల్లో చోటు సంపాదించిన మహీంద్రా రాజు మీరు. మిమ్మల్ని తీసేసే ధైర్యం ఎవరికి ఉంది?’’ అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఓ సంస్థను ఏర్పాటు చేసి పెద్దది చేసిన వ్యక్తిని ఎవరు మాత్రం తీసేస్తారంటూ మరో యూజర్ రిప్లై ఇచ్చారు. ఒక యూజర్ మాత్రం.. స్కార్పియో ఇంటీరియర్ బాగా ఉండేలా చూడాలంటూ సూచించారు. బయట చూడ్డానికి బాగానే ఉన్నా.. లోపల మాత్రం స్కార్పియో బాగాలేదని అన్నారు.
Go Back to Shorts
Anand Mahindra
Scorpio
Twitter

More Telugu News