Mahesh Babu: 'సర్కారువారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!

  • 'సర్కారువారి పాట'పై అంచనాలు పెంచిన సాంగ్స్ 
  • అందరిలో మరింత ఆసక్తిని పెంచిన ట్రైలర్
  • ఈ నెల 7వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్  
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల 
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా 'సర్కారువారి పాట' రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి, పరశురామ్ దర్శకత్వం వహించాడు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. లవ్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానంగా నడిచే ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు.


ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టీమ్ సన్నాహాలు చేస్తోంది.  ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ ఇందుకు వేదిక కానుంది. ఆ రోజు సాయంత్రం నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. 
 
.రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా 'గోవా'లో చిత్రీకరించిన ఇంటర్వెల్ బ్యాంగ్ కి థియేటర్స్ లో విజిల్స్ పడతాయని చెబుతున్నారు. హ్యాట్రిక్ హిట్ తరువాత మహేశ్ చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందనేది చూడాలి.

More Telugu News