'కళావతి' ఫుల్ సాంగ్ చూడాల్సిందే: శేఖర్ మాస్టర్

Sarkaru Vaari Paata movie update
  • 'కళావతి' సాంగును కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ 
  • మహేశ్ తో క్యూట్ స్టెప్పులు వేయించానంటూ వెల్లడి 
  • ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి చేశారంటూ వివరణ
  • ఫుల్ సాంగ్ చూస్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారన్న మాస్టర్    
ప్రభుదేవా .. లారెన్స్ తరువాత టాలీవుడ్లో కొరియోగ్రఫర్ గా శేఖర్ మాస్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ పై ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయన కంపోజ్ చేసిన పాటల్లో 'కళావతి' అనే సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకెళ్లింది. 
 
తాజాగా 'సర్కారువారి పాట' సినిమాను గురించి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ .. "ఈ  సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు మహేశ్ గారితో చాలా అందంగా .. చాలా క్యూట్ గా చేయించాలని అనుకున్నాను. ఆ మూమెంట్స్ క్యాచీగా ఉండి .. అందరూ ఫాలో అయ్యేలా కంపోజ్ చేయాలనుకున్నాను. లక్కీగా బాగా వర్కౌట్ అయింది. 

ఫుల్  సాంగ్  చూడాలి .. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మహేశ్ గారు చాలా బాగా చేశారు .. ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తారు. "మీకు ఓకేనా మాస్టర్ .. మళ్లీ ఇంకోసారి చేద్దమా అని మహేశ్ అడిగేవారు. ఓకే సార్ ..  బాగా వచ్చిందని చెప్పేవరకూ ఆయన ట్రై చేస్తూనే ఉంటారు. ఆయన అంత ఎఫర్ట్ పెట్టారు గనుకనే ఆ సాంగ్ అంత బాగా వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Sarkaruvari Pata Movie

More Telugu News