Ram Gopal Varma: మగాడి కంటే పవర్ ఫుల్... ఇలాంటి మహిళను ఇప్పటిదాకా చూడలేదు: రామ్ గోపాల్ వర్మ

  • విడుదలకు సిద్ధమైన 'అశోకవనంలో అర్జునకల్యాణం'
  • ప్రాంక్ వీడియో చేసిన విష్వక్సేన్
  • ఓ టీవీ చానల్ డిబేట్ లో రభస
  • విష్వక్సేన్ ను "గెటౌట్" అని అరిచిన యాంకర్
Ram Gopal Varma tweets on Vishwaksen issue

తన కొత్త చిత్రం 'అశోకవనంలో అర్జునకల్యాణం' కోసం హీరో విష్వక్సేన్ ప్రాంక్ వీడియో చేయడం, ఓ టీవీ చానల్ డిబేట్లో యాంకర్ ఆగ్రహంతో విష్వక్సేన్ ను "గెటౌట్" అని అరవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తొలిసారిగా ఓ మహిళ మగాడి కంటే ఎంతో శక్తిమంతంగా కనిపించిందని, గతంలో ఇలాంటిది తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఆమె 'సర్కార్' కంటే ఏమీ తక్కువ కాదని వర్మ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, విష్వక్సేన్-టీవీ యాంకర్ ఎపిసోడ్ వీడియోను కూడా వర్మ పంచుకున్నారు.

More Telugu News