ఆ హీరోతోనే పరశురామ్ నెక్స్ట్ మూవీ!
- మహేశ్ మూవీని రిలీజ్ కి రెడీ చేసిన పరశురామ్
- ఆ తరువాత సినిమా నాగచైతన్యతో
- ఆల్రెడీ రెడీగానే ఉన్న స్క్రిప్ట్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి జరుగుతున్న సన్నాహాలు
మహేశ్ బాబుతో ఆయన 'సర్కారువారి పాట' సినిమాను పూర్తిచేశాడు. మే 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అలా ఈ లోగా చైతూ కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ' థ్యాంక్యూ' సినిమాను పూర్తి చేశాడు. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక పరశురామ్ తరువాత సినిమా చైతూతోనే ఉండనుందని సమాచారం. గతంలో ప్రాజెక్టు వర్క్ మొత్తం రెడీ చేసి ఉన్నందు వలన, ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. 'గీత గోవిందం' సెంటిమెంట్ కారణంగా ఆమె ఈ సినిమా చేయడం ఖాయమేననే టాక్ వినిపిస్తోంది.