దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... రేపు సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం
- భారత్ లో మళ్లీ పుంజుకుంటున్న కరోనా
- అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివిటీ రేటు
- దిశానిర్దేశం చేయనున్న ప్రధాని
ఈ వీడియో కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత, దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. అనంతరం, సీఎంలు తమ పరిధిలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరిస్తారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత స్థితిగతులపై మోదీ సీఎంలకు దిశానిర్దేశం చేస్తారు.