ఏపీలో విద్యుత్ రంగ సమస్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే...!
- విద్యుత్ సంస్థల అధికారులతో టెలీకాన్ఫరెన్స్
- బొగ్గు కొరత తీవ్రంగా ఉందని వెల్లడి
- దిగుమతి కూడా కష్టంగా మారిందని వివరణ
- మే మొదటివారం నాటికి అధిగమిస్తామని ధీమా
థర్మల్ ప్లాంటులో 24 రోజులకు సరిపడా నిల్వలు ఉంచుకోవడం నిబంధనల్లో భాగమని, కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. అనేక రాష్ట్రాల్లోని థర్మల్ ప్లాంట్లలో చూస్తే రెండు నుంచి ఐదు రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని వివరించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం బొగ్గు ధరలు రికార్డు స్థాయికి చేరాయని, దిగుమతి చేసుకోవడం కూడా క్లిష్టంగా మారిందని అన్నారు.
బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అనేక రాష్ట్రాలు బారులు తీరుతున్నాయని, దాంతో విద్యుత్ కొనుగోలు ధర అమాంతం పెరిగిపోయిందని చెప్పారు. అందుకే ఆయా రాష్ట్రాల బాటలో ఏపీలోనూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించక తప్పలేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఏపీలో విద్యుత్ కొరతను తాము అధిగమించగలని, ఈ పరిస్థితి తాత్కాలికమేనని భావిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మే మొదటి వారం నాటికి ఏపీలో విద్యుత్ సమస్యలు చక్కబడతాయని అన్నారు.