Chhote Lal Varma: దొంగలు బూట్లు ఎత్తుకెళ్లడంతో ఉత్త కాళ్లతో నడిచి వెళ్లిన ఎమ్మెల్యే... వీడియో ఇదిగో!

BJP MLA walks with barefoot after thieves stolen shoe at temple
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ లో ఓ బీజేపీ ఎమ్మెల్యేకి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఫతేహాబాద్ శాసనసభ్యుడు ఛోటేలాల్ వర్మ ఆగ్రాలో సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆలయం వద్దకు తరలివెళ్లారు. మందీమార్బలం వెంట రాగా ఆర్భాటంగా వచ్చారు. తీరా దైవ దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి తిరిగొచ్చేలోపు ఎమ్మెల్యే బూట్లను దొంగలు కొట్టేశారు. 

ఎమ్మెల్యే బూట్లు కనిపించకపోవడంతో పోలీసులు, అధికారులు ఆగమేఘాలపై తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదిలేక ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ తన కారు వరకు ఉత్త కాళ్లతోనే నడిచి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Go Back to Shorts
Chhote Lal Varma
Shoe
Theft
Templa
Agra
BJP
Uttar Pradesh

More Telugu News