Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్' నుంచి 'కొమ్మా ఉయ్యాలో' ఫుల్ సాంగ్ ఇదిగో .. చూసేయండి!

RRR Komma Uyyalo full song released
షార్ట్స్‌లో చూడండి
'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని ప్రతి పాట కూడా మనసును పట్టుకుంటుంది. మర్చిపోకుండా మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉంటుంది. 'కొమ్మా ఉయ్యాలా .. కోన జంపాలా' అనే పాటతోనే ఈ సినిమా మొదలవుతుంది. అడవి ప్రాంతంలోని ఓ గూడెంకు చెందిన మల్లి అనే అమ్మాయి ఈ పాట ఎత్తుకోవడంతోనే కథ మొదలవుతుంది.  

ఈ మల్లి అనే అమ్మాయిని తెల్లదొరసాని బలవంతంగా తీసుకుని పోవడంతో, తిరిగి తీసుకుని రావడానికే కొమరం భీమ్ రంగంలోకి దిగుతాడు. సినిమాలో ఈ పాట కొంతే ఉంటుంది .. హాయిగా సాగే ఈ పాట మరికొంత సేపు ఉంటే బాగుంటుందే అనిపిస్తుంది. ఆ పాట వీడియోను పూర్తిగా ఈ రోజున వదిలారు. 

ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా, ప్రకృతి రెడ్డి అనే అమ్మాయి ఈ పాట పాడింది. సంగీతం .. సాహిత్యం .. ఆలాపన .. సందర్భం అన్నీ కుదిరిన పాట ఇది. అందువల్లనే వెంటనే అందరి మనసులకు కనెక్ట్ అయింది. ఈ పాటను ఇప్పుడు చూస్తుంటే .. మరోసారి  చేయిపట్టుకుని కథలోకి తీసుకుని పోతున్నట్టుగా అనిపించడం ఖాయం.
Go Back to Shorts
Junior NTR
Ramcharan
RRR Movie

More Telugu News