KGF 2: 'బాహుబలి' రికార్డులను తన సినిమా బ్రేక్ చేస్తుందా? అనే ప్రశ్నకు యష్ ఆసక్తికర సమాధానం!

Yash response on breking of Bahubali records
షార్ట్స్‌లో చూడండి
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కేజీఎఫ్ 2' ఈ నెల 14న విడుదల కాబోతోంది. 'కేజీఎఫ్' ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా... ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా... రవీనా టాండన్, సంజయ్ దత్ వంటి స్టార్లు కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. 

ఇంకోవైపు 'బాహుబలి' రికార్డులను 'కేజీఎఫ్ 2' బద్దలు కొడుతుందా? అనే ప్రశ్నకు యష్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చాడు. కొత్తగా వచ్చే సినిమా పాత సినిమా రికార్డులను బద్దలు చేయాలని... అప్పుడే దాన్ని పురోగతి అంటారని చెప్పాడు. ఒక సినిమా రికార్డు క్రియేట్ చేసిందని సైలెంట్ గా కూర్చోకూడదని అన్నారు. కలెక్షన్లు, రికార్డులు అనేవి మారుతూనే ఉంటాయని చెప్పారు. దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని అన్నారు.
Go Back to Shorts
KGF 2
YASH
Bahubali
Records

More Telugu News