అక్కినేని అభిమానులకు సారీ చెప్పిన నిర్మాత అనిల్.. ఎందుకంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్కినేని అభిమానులకు సారీ చెప్పిన నిర్మాత అనిల్.. ఎందుకంటే..!

Anil Sunkara Big Sorry For Akkineni Fans
  • ఇవాళ అక్కినేని అఖిల్ జన్మదినం
  • ‘ఏజెంట్’ టీజర్ రిలీజ్ వాయిదా
  • అత్యున్నతమైన టీజర్ ను ఇస్తామన్న అనిల్
  • వచ్చేనెలలో విడుదల చేస్తామని వెల్లడి
అక్కినేని అభిమానులకు నిర్మాత అనిల్ సుంకర క్షమాపణలు చెప్పారు. ‘అక్కినేని ఫ్యాన్స్ కు సారీ’ అంటూ ఆయన ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సక్సెస్ తర్వాత ‘ఏజెంట్’గా అఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో అఖిల్ తన దేహదారుఢ్యాన్ని ప్రదర్శించేస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో బీస్ట్ లా మారిపోతున్నాడు. 

అయితే, ఇవాళ అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ టీజర్ ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ, దానిని వాయిదా వేశారు. దీంతో అక్కినేని అభిమానులకు అనిల్ సుంకర సారీ చెబుతూ వివరణ ఇచ్చారు. 

‘‘మేం అభిమానులు కోరుకున్న దానికన్నా ఎక్కువ, అత్యున్నతమైన టీజర్ ను ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే మీకు వెయిటింగ్ తప్పడం లేదు. కానీ, ఆ వెయిటింగ్ కు తగ్గట్టే వచ్చే నెలలో అత్యంత నాణ్యమైన థియేట్రికల్ టీజర్ ను విడుదల చేస్తామని హామీ ఇస్తున్నా’’ అంటూ అనిల్ సుంకర ట్వీట్ చేశారు.
Tollywood
Akkineni
Akhil Akkineni
Anil Sunkara
Agent

More Telugu News