విషాదంగా మారిన వివాహానంతర ఫొటో షూట్!
- ఇటీవల బాగా పెరిగిన వెడ్డింగ్ ఫొటోషూట్ లు
- మార్చి 14న పెళ్లి చేసుకున్న రెజిల్, కార్తీక
- కట్టియాడి నదిలో ఫొటోషూట్
- ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయిన జంట
- వరుడు మృతి, వధువు పరిస్థితి విషమం
కోజికోడ్ ప్రాంతంలోని కడియంగడ్ కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న పెళ్లి చేసుకున్నారు. అయితే, ఫొటో షూట్ కోసం తాజాగా కట్టియాడి నది వద్దకు వచ్చారు. అయితే వీరు ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న రెజిల్, కార్తీకను ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు రెజిల్ మరణించగా, కార్తీక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో కడియంగడ్ లో విషాదం నెలకొంది.