మరో ఆసక్తికరమైన కొటేషన్ పంచుకున్న పవన్ కల్యాణ్
- రచయిత వాకాడ శ్రీనివాస్ వ్యాఖ్యలతో పవన్ ట్వీట్
- అభిమానుల నుంచి విశేష స్పందన
- గతంలోనూ ఇదే తరహాలో పవన్ కొటేషన్లు
తాజాగా, సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఉన్న ఓ కొటేషన్ ను ఉదహరించారు. "శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగినంత మూర్ఖత్వం మనది. అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే" అనే కొటేషన్ ను ట్వీట్ చేశారు. బీసీ, ఎస్సీలు అధికారంలోకి రావాల్సిన అవశ్యకతపై రామ్ మనోహర్ లోహియా ఆలోచనా విధానాన్ని ప్రతిఫలించేలా రచయిత వాకాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని పవన్ వివరించారు.