సినిమా కోసం ఇంకేమైనా చేయాలా అని అడిగేవారు: పవన్ గురించి దర్శకుడు సాగర్ కె చంద్ర
- పవన్ హీరోగా భీమ్లా నాయక్
- ఇటీవలే విడుదల
- సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చిత్రం
- తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ సినిమాకు పవన్ కల్యాణ్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. పవన్ అగ్రహీరో అయినప్పటికీ దర్శకుడికి ఎంతో విలువనిచ్చే వ్యక్తి అని కొనియాడారు. భీమ్లా నాయక్ సమయంలో ఈ సినిమాకు సంబంధించి తాను ఇంకేమైనా అదనంగా చేయాలా? అని పవన్ కల్యాణ్ అడిగారని వెల్లడించారు. అంతేకాదు, మరో టేక్ చేయమన్నా చేసేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారని, తాను చెప్పేది శ్రద్ధగా వినేవారని సాగర్ కె చంద్ర వివరించారు.