'పుష్ప 2'లోను మెరవనున్న సమంత!
- బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'పుష్ప'
- సీక్వెల్ దిశగా మొదలైన సన్నాహాలు
- స్పెషల్ సాంగులో దిశా పటాని
- త్వరలోనే సెట్స్ పైకి
ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. జూన్ ... జూలైలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆ ఐటమ్ భామగా ఈ సారి దిశా పటాని కనిపించనుందనే టాక్ వచ్చింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ భామనే రంగంలోకి దింపుతున్నారట.
అయితే ఈ సినిమాలోనూ సమంత మెరవనుందనే ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది. ఒక ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపిస్తుందని అంటున్నారు. తన అభిమాన తార సమంత అని చాలా వేదికలపై సుకుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె పట్ల గల ఆ అభిమానంతోనే ఆమె కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేయడం జరిగిందని చెబుతున్నారు.