Junior NTR: 'మహారాజ'మౌళిగారూ, మీ ఊహాశక్తి అతీతం: డైరెక్టర్ శంకర్

RRR Movie Update
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' నిన్ననే థియేటర్లకు వచ్చింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలను రాజమౌళి డిజైన్ చేసిన తీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా చూసిన స్టార్ డైరెక్టర్లు అంతా కూడా రాజమౌళిని తమదైన శైలిలో అభినందిస్తున్నారు. 

ఈ కోవలో తమిళ దర్శకుడు శంకర్ స్పందిస్తూ .. "మీ ఊహా శక్తి అతీతమైనది .. మీకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.  ఎన్టీఆర్ - చరణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు" అని పేర్కొంటూ, 'మహారాజ' మౌళి అంటూ ఆయనను సంబోధించారు.
Go Back to Shorts
Junior NTR
Ramcharan
Rajamouli
RRR Movie

More Telugu News