RRR: హైదరాబాదులో 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ షోలు వేసే థియేటర్లు ఇవే!

Five theaters gets nod for RRR special screanings in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ చరిత్రలో భారీ చిత్రాల మొనగాడుగా పేరుగాంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' రేపు (మార్చి 25) విడుదల అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటవిశ్వరూపం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, తొలి ఆట చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. 

కాగా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని హైదరాబాదులోని 5 థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. అర్జున్ థియేటర్ (కూకట్ పల్లి), మల్లికార్జున (కూకట్ పల్లి) భ్రమరాంబ (కూకట్ పల్లి), విశ్వనాథ్ (కూకట్ పల్లి), మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో ఈ స్పెషల్ షోలకు అనుమతి లభించింది. ఈ స్పెషల్ షోలు ఉదయం 7 గంటల కంటే ముందే ప్రారంభం కానున్నాయి. వీటి అనంతరం, బెనిఫిట్ షోలు ఉదయం 7 గంటల నుంచి షురూ అవుతాయి.
Go Back to Shorts
RRR
Theaters
Special Screening
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News