పార్లమెంటు సమీపంలో.. కేరళ కాంగ్రెస్ ఎంపీపై పోలీసు దెబ్బ
- కే రైల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
- అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
- ఇరువర్గాల మధ్య తోపులాట
- కాంగ్రెస్ ఎంపీ హిబి ఇడెన్ పై చేయి చేసుకున్న పోలీసులు
పార్లమెంటు సమీపంలోని విజయ్ చౌక్ వద్ద కే రైల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనకు దిగాయి. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటం.. మరోపక్క అక్కడికి సమీపంలోనే విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు.
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఆ పార్టీ శ్రేణులను అక్కడి నుంచి తరలించే యత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా.. తమతో వాదిస్తున్న హిబి ఇడెన్ చెంప చెళ్లుమనేలా ఓ పోలీస్ పంచ్ విసిరారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన ఇడెన్ ఈ విషయంపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదించనున్నట్లుగా తెలిపారు.