Nayanthara: నయనతార గురించి చక్కర్లు కొడుతున్న మరో పుకారు!

Nayanatara going to have baby with surrogacy
  • సరోగసీ ద్వారా బిడ్డను కనబోతోందంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
  • ఇంకా స్పందించాల్సిన నయన్, విఘ్నేశ్
ప్రముఖ సినీ నటి నయనతార తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంకా పెళ్లి కాలేదని, త్వరలోనే చేసుకుంటామని నయనతార వివరణ ఇచ్చింది. మరోవైపు ఇటీవల నుదిట మీద కుంకుమ పెట్టుకుని నయనతార కనిపించడంతో... వీరి పెళ్లి అయిపోయిందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. నయన్ సరోగసి ద్వారా బిడ్డను కనబోతోందనేదే ఆ వార్త. ఇప్పుడు ఈ వార్త దక్షిణాదిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలపై ఇంకా నయన్, విఘ్నేశ్ శివన్ స్పందించాల్సి ఉంది.
Nayanthara
Surrogacy
Baby
Tollywood

More Telugu News