జానీ మాస్టర్ తో మ్యూజిక్ వీడియో రూపొందించిన ఐశ్వర్య... ఆవిష్కరించిన రజనీకాంత్
Add ap7am to your home Screen

జానీ మాస్టర్ తో మ్యూజిక్ వీడియో రూపొందించిన ఐశ్వర్య... ఆవిష్కరించిన రజనీకాంత్

Rajinikanth releases Payani music video directed by Aishwarya
  • 'పయని' వీడియో గీతానికి ఐశ్వర్య దర్శకత్వం
  • 9 ఏళ్ల తర్వాత డైరెక్షన్ చేపట్టిన ఐశ్వర్య
  • ఎంతో సంతోషంగా ఉందన్న రజనీకాంత్
  • జానీ మాస్టర్, శ్రష్టి వర్మ జంటగా పయని
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య 'పయని' అనే మ్యూజిక్ వీడియో రూపొందించారు. ఈ మ్యూజిక్ సింగిల్ లో ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లీడ్ రోల్ లో నటించడం విశేషం. ఈ వీడియోను తలైవా రజనీకాంత్ నేడు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తన కుమార్తె దర్శకత్వం వహించిన 'పయని' మ్యూజిక్ సింగిల్ ను రిలీజ్ చేయడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఐశ్వర్య 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ డైరెక్షన్ చేపట్టిందని రజనీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వివరించారు. 

కాగా, 'పయని' సాంగ్ లో జానీ మాస్టర్ సరసన శ్రష్టి వర్మ నటించింది. ఈ పాటకు అంకిత్ తివారీ బాణీలు అందించగా, అనిరుధ్ ఆలపించారు. తమిళంలో సాగే ఈ పాటకు వివేక సాహిత్యం అందించారు.
Payani
Music Video
Rajinikanth
Aishwarya
Jani Master
Shrasti Verma

More Telugu News