మహేశ్ యాక్షన్ స్టిల్ మామూలుగా లేదు!
- మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
- బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరిగే కథ
- కీలకమైన పాత్రలో సముద్రఖని
- మే 12వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ పాళ్లు ఉంటాయని ముందుగానే చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్స్ సీన్స్ నే ముందుగా చిత్రీకరించారు. దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. తాజాగా వదిలిన మహేశ్ యాక్షన్ స్టిల్ కూడా ఆకట్టుకుంటోంది.
బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరిగే ఈ కథలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మహేశ్ - వెన్నెల కిశోర్ కాంబినేషన్లోని కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఇక సముద్రఖని ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.