అజిత్ మాటంటే మాటే!
- అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
- ఈ నెల 24న థియేటర్లలో విడుదల
- అంచనాలను అందుకోలేకపోయిన సినిమా
- అభిమానుల్లో అసంతృప్తి
ఈ విషయంలో అజిత్ అభిమానులు అసంతృప్తికి లోనయ్యారట. దర్శకుడు వినోద్ యాక్షన్ సీన్స్ పై పెట్టిన శ్రద్ధ కథాకథనాలపై పెట్టకపోవడం వల్లనే ఈ సినిమా ఆశించిన స్థాయిని చేరలేకపోయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట. ఆ తరువాత సినిమాను కూడా వినోద్ దర్శకత్వంలోనే అజిత్ చేయనుండటం విశేషం.
అయితే 'వలిమై' అంచనాలను అందుకోలేకపోయింది గనుక, వినోద్ దర్శకత్వంలో చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలను అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కానీ అజిత్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. వచ్చే వారంలోనే కొత్త సినిమా షూటింగును మొదలుకానుందని అంటున్నారు. అజిత్ ఒకసారి మాట ఇచ్చాడంటే .. ఇక మార్చుకోరని చెబుతున్నారు. ఈ సినిమాకి కూడా బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.