భీమ్లా నాయక్ టీమ్ కు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసిన పవన్, త్రివిక్రమ్!

Pawan and Trivikram reportedly arranged grand party to Bheemla Nayak team
  • భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్
  • ఆనందోత్సహాల్లో చిత్రబృందం
  • పార్టీ జరుపుకున్న వైనం
  • నెట్టింట ఫొటోలు, వీడియోలు వైరల్
పవన్ కల్యాణ్ కెరీర్ లో పెర్ఫార్మెన్స్ పరంగా భీమ్లా నాయక్ ఓ రేంజ్ లో నిలుస్తుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం అందుకుంది. ఈ నేపథ్యంలో, విజయోత్సవ ప్రెస్ మీట్ నిర్వహించిన భీమ్లా నాయక్ చిత్రబృందం ఆపై గ్రాండ్ గా పార్టీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. 

ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. పవన్, త్రివిక్రమ్, తమన్ సహా భీమ్లా నాయక్ టీమ్ కు పనిచేసినవాళ్లందరూ ఈ పార్టీలో దర్శనమిచ్చారు. కాగా, పవన్ కారు దిగి రాగా, బాణసంచాతో స్వాగతం పలికారు. పవన్ ను త్రివిక్రమ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 




Go Back to Shorts
Pawan Kalyan
Trivikram Srinivas
Bheemla Nayak
Grand Party
Tollywood

More Telugu News