'ఏ మాయ చేశావే'కు 12 ఏళ్లు.. స‌మంత భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు

Samanthaprabhu2 Today marks my 12th year in the Film Industry
  • ఆ సినిమాతో సినీ రంగంలోకి ప్ర‌వేశించిన‌ సమంత 
  • 12 ఏళ్లు పూర్త‌వుతున్నాయన్న సామ్
  • లైట్స్‌, కెమెరా, యాక్ష‌న్‌, ఎలాంటి పోలిక‌లూ స‌రిపోని క్ష‌ణాలంటూ వ్యాఖ్య‌లు
  • భ‌గ‌వంతుడికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాన‌ని ట్వీట్
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం 'ఏ మాయ చేశావే'తో సినీ రంగంలోకి ప్ర‌వేశించిన‌ సమంత అనంత‌రం ద‌క్షిణాది స్టార్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా వెలుగొందిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా 2010, ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌లైంది. నేటితో 12 ఏళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా దీనిపై స‌మంత భావోద్వేగ‌భరితంగా పోస్ట్ చేసింది.  

'లైట్స్‌, కెమెరా, యాక్ష‌న్‌...  12 ఏళ్ల జ్ఞాప‌కాలు, అనుభ‌వాలు గుర్తుకువ‌స్తున్నాయి. ఈ గొప్ప‌ ప్ర‌యాణం, ప్ర‌పంచంలోనే అత్యంత విధేయ‌త ఉన్న‌ అభిమానులను ఇచ్చినందుకు భ‌గ‌వంతుడికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాను.. అవి వేటికీ సరిపోలని క్షణాలు' అని స‌మంత పేర్కొంది. కాగా, ద‌క్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న స‌మంత ఇప్పుడు కూడా ప‌లు సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. వెబ్ సిరీస్‌ల‌లోనూ ఆమె త‌నదైన ముద్ర వేసుకుంటోంది.
Samantha
Tollywood
Naga Chaitanya

More Telugu News