రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. రూ. 53 వేలు దాటిన పుత్తడి ధర
- అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధరపై ఏకంగా 20 డాలర్ల పెరుగుదల
- బంగారం బాటలోనే వెండి
- ప్రస్తుతం వివాహాలు లేకపోవడంతో వేచి చూసే ధోరణిలో వినియోగదారులు
బుధవారం ఉదయం ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల రూ. 50,700గా ఉండగా, 22 కేరెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 47 వేలుగా ఉంది. వెండి కిలో రూ. 65,600గా ఉండగా, ఒక్క రోజులోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. అయితే, ఇప్పట్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు లేకపోవడంతో వినియోగదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.